స్తుతి - ప్రార్థనాంశాలు
- ఇంతవరకు మనలను కాపాడి, నడిపించిన మన రక్షకుడైన యేసు క్రీస్తునకును, సర్వాధిపతియైన ప్రభువునకును స్తోత్రము కలుగును గాక.
- దేవుని సేవకులు షాన్ కేనవన్ గారి కుటుంబం వారి ఇంటికి క్షేమంగా చేరుకున్నందుకు దేవుని స్తుతించండి. వెళ్ళిన వెంటనే వారిని 14 రోజులు క్వారెంటైన్ లో ఉంచారు. ప్రస్తుతం ఎటువంటి సమస్య లేదు. వారి కొరకు ప్రార్థించండి.
- ప్రపంచ విపత్తు "కోవిడ్-19" నుండి దేవుడు విమోచించు నట్లు ప్రార్థించండి. ముఖ్యంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాల కొరకు ప్రార్థించండి.
- మన దేశంలో కూడా గత రెండు, మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుచున్న నేపధ్యంలో అందరి కాపుదల కొరకు, వ్యాధితో బాధపడుచున్న వారి స్వస్థత కొరకు ప్రార్థించండి.
- మన విశాఖపట్నంలో కూడా క్రమంగా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య పెరుగు చుండగా దేవుని కనికరం కొరకు ప్రార్థించండి.
- ఈ విపత్కర పరిస్థితుల మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకొనుటకు తగిన వివేకం కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థించండి.
- వైద్యం కొరకు అవసరమైన పరికరాలు, వనరులు అందుబాటులో ఉండునట్లు ప్రార్థించండి.
- ప్రజలు కూడా విజ్ఞత కలిగి అధికారులతో, వైద్యులతో, పోలీసు వారితో సహకరించు నట్లు ప్రార్థించండి.
- అధికారులు, వైద్యులు, పోలీసువారు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, విలేకరులు మరియు తదితరులు (నిత్యావసర మరియు అత్యావసర సేవలను అందించు వారు) నిరంతరం అవిరామంగా ఎంతో ఆశక్తితో విధులు నిర్వహించుచుండగా వారి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థించండి.
- వ్యాధి బారిన పడిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల క్షేమం కొరకు ప్రార్థించండి.
- బీదల కొరకు, ఏ దిక్కూ లేని వారి కొరకు, నిరాశ్రయులుగా ఉన్నవారి కొరకు ప్రార్థించండి. తగిన సహాయ సహకారాలు అందించండి.
- ప్రధాన మంత్రి నిధికి, ముఖ్య మంత్రి నిధికి అవసరమైన నిధులు ప్రజలు ధారాళంగా అందించ గలుగు నట్లు ప్రార్థించండి.
- దేశంలో, రాష్ట్రంలో అలజడి సమసిపోయి, సమాధానం శాంతి వర్ధిల్లునట్లు ప్రార్థించండి. మీడియా మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయక, ప్రజా ప్రయోజన్నాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయ గలుగుటకు తగిన జ్ఞాన వివేకముల నిమిత్తం ప్రార్థించండి.
- ప్రతి క్రైస్తవ కుటుంబము వారి వారి ఇండ్లలోనే వారి కుటుంబ సభ్యులతో కలసి దేవుని సన్నిధిలో ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయునట్లు ప్రార్థించండి. ఆలయాలలో ఆరాధనలు లేవని క్రుంగి పోకుండా, వాక్య ధ్యానానికి, ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని కేటాయించ గలుగునట్లు ప్రార్థించండి. విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేయకండి. మంచి పౌరులంగా సహకరిద్దాం, చేయగల సహాయం చేద్దాం.
- వృద్ధుల కొరకు, దీర్ఘకాల వ్యాధులతో పోరాడుతున్న వారి కొరకు, ప్రమాద వశాత్తు ఆకస్మికముగా అనారోగ్య పాలైన వారి కొరకు, వారికి ఉపచారము చేయు వారికి కావలసిన సహనం కొరకు, ధైర్యం, ఆదరణ, స్వస్థతల కొరకు, సరియైన వైద్యం కొరకు ప్రార్థించండి.
- సరిహద్దులలో పోరాడుచున్న త్రివిధ దళాల సైనికుల కొరకు, సంబధిత వ్యవస్థల కొరకు, రవాణా వ్యవస్థ కొరకు, పోలీసు వ్యవస్థ కొరకు, న్యాయ వ్యవస్థ కొరకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొరకు ప్రార్థించండి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించండి. పరమత సహనం కొరకు ప్రార్థించండి.
- మన మధ్య వాక్య పరిచర్య చేయుచున్న సేవకుల కొరకు, ఆయా ప్రాంతములలోని మన సంఘముల
కొరకు, యేసు క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం కొరకు, ప్రభువు రాకడ కొరకు
అపేక్షతో ఎదురు చూచుట కొరకు ప్రార్థించండి.
No comments:
Post a Comment