గుడ్ ఫ్రైడే ఆరాధనకు సూచనలు



గుడ్ ఫ్రైడే ఆరాధనకు సూచనలు

ప్రభువునందు ప్రియమైన సంఘమునకు యేసు క్రీస్తు నామములో శుభములు కలుగును గాక.

ప్రపంచం మొత్తం భయం గుప్పెట్లో ఉంది. ఎటుపోవాలో పాలుపోని పరిస్థితి. దేవుడే మన కాశ్రయం. ఆయన మనకు సహాయం చేయక పొతే, మనకు తప్పించుకొనే మార్గమే లేదు. "కొండల తట్టు నేను కన్నులెత్తు చున్నాను నాకు సహాయ మెక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించిన వాడు" (కీర్తన 121:1-2). ఇదే మన స్థిర విశ్వాసం.

ఈ విపత్తు నుండి విడిపింప బడునట్లు ప్రార్థన చేయండి. ఇంట్లోనే ఉండి దేవుని నామాన్ని మహిమ పరచండి. కుటుంబాలుగా అందరూ కూడుకుని ఆరాధించండి. వాక్య ధ్యానం చేయండి. దయచేసి ఎవరూ నిర్లక్ష్యం చేయకండి. ఈ కష్టకాలంలో మీ ప్రార్థనలు అవసరం. ప్రజలు వారి రోగముల నుండి, పాపముల నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పింప బడుటకు నిత్యమూ ప్రార్థించండి.

అదేవిధంగా, నేను ఇంతకూ ముందు మీకు తెలియ జేసినట్లు మీ చేతనైన సహాయమును అవసరంలో ఉన్నవారికి అందించండి. పోరాటంలో ఉన్నవారికి చేయూత నివ్వండి. సహకరించండి. దేవుని నామాన్ని మహిమ పరచండి.

ఈ పరిస్థితుల మధ్య మనం ఒకేచోట కూడుకుని ఆరాధించే పరిస్థితి లేదు గనుక శుభ శుక్ర వారానికి సంబంధించిన సందేశాన్ని వాట్సప్ మరియు మన సంఘ బ్లాగ్ ద్వారా మీకు అందించుచున్నాము. దీనిని మీరు అనుసరించాలని కోరుచున్నాము.

ప్రభువు మీ ధ్యాన సమయమును, సహవాసమును దీవించును గాక.

_______________



ఆరాధనా క్రమము
(ఈ క్రింద ఒక క్రమమును సూచించాం. మీకు సహాయ కరంగా ఉండుటకు మాత్రమే దీనిని సూచిస్తున్నాము. మీకు అనుకూలముగా దీనిని మలచుకోవచ్చు. ఆయన పాద సన్నిధిలో నేర్చుకొనుట ప్రాముఖ్యం. కుటుంబమంతా సంతోషంగా, ప్రార్థనా పూర్వకంగా పాల్గొనండి.)

  1. ప్రారంభ ప్రార్థన : కుటుంబ యజమాని
  2. అందరూ కలసి ఒకటి / రెండు పాటలు పాడండి : మీకు వచ్చిన పాటలు పాడండి.
  3. ఉత్తర ప్రత్యుత్తరాలు : యెషయా 53 వ. అధ్యాయం (ఎవరైనా ఒకరు నడిపించండి)
  4.  ప్రార్థన : ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించండి.
  5. పాట:
  6. ఉపోద్ఘాతం : మార్కు సువార్త 15:16-37 వచనాలు చదవండి.
  7. పల్లవి, మొదటి చరణం : "ఆహా మహాత్మా హా శరణ్యా"  (పాడలేకపోతే, పాటలను జాగ్రత్తగా చదవండి.)
  8. మొదటి మాట : "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము"
  9. పల్లవి, రెండవ చరణం :
  10. రెండవ మాట : "నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువు"
  11. పల్లవి, మూడవ చరణం :
  12. మూడవ మాట : "అమ్మా, ఇదిగో నీ కుమారుడు ... ఇదిగో నీ తల్లి"
  13. పల్లవి, నాల్గవ చరణం :
  14. నాల్గవ మాట : "నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడచితివి?"
  15. పల్లవి, ఐదవ చరణం :
  16. ఐదవ మాట : "దప్పిగొనుచున్నాను"
  17. పల్లవి, ఆరవ చరణం :
  18. ఆరవ మాట : "సమాప్తమైనది"
  19. పల్లవి, ఏడవ చరణం :
  20. ఏడవ మాట : "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను"
  21. ముగింపు : ఇద్దరు లేక ముగ్గురు ప్రార్థనలో నడిపించి, ఒక పల్లవి పాడి, ముగించండి.


No comments:

Post a Comment